మధురానుభూతి.....:-మొహమ్మద్ అఫ్సర వలీషా ద్వారపూడి( తూ గో జి )
కొన్ని  మాధుర్యాలు ఎందుకో 
మనసు మూలమూలలకు వెళ్ళి 
అమృతాన్ని నింపి వస్తుంటాయి....

ఆ మాధుర్యానికి తనువు
అలసిన దేహాన్ని సాంత్వన 
పరుస్తుంటుంది....

దిగులు మబ్బులు తరిమేసి 
అంబరాన స్వైర విహారం
చేయిస్తుంటాయి....

ఎన్టీఆర్ నటనా కౌశల్యం 
ఏఎన్నార్ నాట్య మాయాజాలం 
సావిత్రి నవరస హావభావం
అంజలిఅద్భుత అభినయం...

ఘంటసాల గానామృతం
బాలు నవరసాల గాత్రం 
సుశీలమ్మ,జానకిల అమృత
కోకిల సుస్వారాలు  మనసును 
తూగుటుయ్యాల లూగిస్తాయి....
 
అందరినీ సంతోష సాగరంలో
ముంచెత్తి మధురానుభూతులు 
 కలిగించేదే  *రంగస్థలం*...

(రంగస్థలం దినోత్సవం సందర్భంగా)