ఈకాలం పండ్లు ..!!:- -----డా.కె.ఎల్.వి.ప్రసాద్--హన్మకొన్డ.
వేసవి కాలానికి 
అనువుగా 
అందుబాటులోకి 
వచ్చేశాయి బజారుకు,
రకరకాల పండ్లు ...
అందరికి ...
ఇష్టమయిన ---
నోరూరించే పండ్లు !

అందరికి --
అందుబాటులోలేకున్నా 
అందుకునే శక్తిలేకున్నా 
పళ్ళుమాత్రం 
విఫణిలో లభ్యం ...
అదేమన అదృష్టం !

సపోటాలు -కమలా ఫలాలు 
పుచ్చకాయలు -కర్బూజా 
ఆపిలుపండ్లు -ద్రాక్షలు ,
అరటిపండ్లు -బొప్పాయి పండ్లు 
వీటి కి తోడు --
చెరుకు రసం -అనాస రసం,
మొక్కజొన్న పొత్తులు 
చిలగడ దుంపలు 
ఒకటేమిటి --
కుదిరితే ....
పిల్లలకన్నీ ఇష్టమే !
అందుబాటులోకి తేవడమే 
కాగలదు ఎందరికో కష్టం ..!!

      


కామెంట్‌లు