కొన్ని క్యారెట్ ముక్కలను మరికొన్ని బీట్రూట్ ముక్కలను కలిపి మిక్సీలో వేసి గుజ్జుగా చేసి బాగా నీరు పోసి ఒక గిన్నెలో వేసి . అందులో తాటి కలకండ లేక బెల్లం కూడా కలపాలి. బాగా మరిగించి అందులో యాలకుల పొడి కూడా కలపాలి. ఇది చల్లారిన తర్వాత త్రాగాలి. ఇది మంచి శక్తినిచ్చే పానీయం.
తీయని దానిమ్మ పండు గింజల తో కూడా తాటి బెల్లం లేక కలకండ కలిపి మిక్సీలో రసంగా తయారుచేసి తాజాగా త్రాగితే శారీరక బలహీనత త్వరగా తగ్గిపోతుంది. చిన్నపిల్లలు ఈ పానీయాన్ని చాలా ఇష్టంగా తాగుతారు.
కొన్ని బాదం పలుకులు నానబెట్టి పై పొట్టు తీసి వేసి మళ్లీ ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవాలి. అందులో అతిమధురం పొడి , కొద్దిగా యాలకుల పొడి కూడా కలిపి నిల్వచేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేక సాయంత్రం చిన్న పిల్లలకు దీనిని పాలలో కలిపి తీయదనం కోసం కలకండ కలపి త్రాగించాలి. ఇది విద్యార్థులకు మంచి మేధాశక్తిని ఇస్తుంది. పరీక్షల ముందుండే భయాన్ని కూడా పోగొడుతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి