ప్లాష్టిక్ సంచులు వద్దు- గుడ్డసంచులే ముద్దు:- సత్యవాణి

 బజారుకెళ్ళర ఓకన్నా
సరుకులుతేరా బంగారూ
బజారుకెళతానోయమ్మా
సంచీ ఇవ్వవె మాయమ్మా
సంచీతోటే సరుకులను
వర్తకుడిస్తాడుర కదబాబీ
ప్లాష్టిక్ సంచీ అతడిచ్చూ
పర్యావరణానికి అదిముప్ఫని
గుడ్డసంచిలనె వాడమని
గురువులుమాకు చెప్పేరు
ప్లాష్టిక్ సంచులు వాడొద్దు
గుడ్డసంచులన మనకెంతోముద్దు