మానవత్వపు విలువలు.....:-మొహమ్మద్ అఫ్సర వలీషా,-ద్వారపూడి (,తూ,గో, జి.)
మధ్యం మత్తు అతణ్ణి
రాక్షసుడిని చేసింది
మత్తులో చిత్తవుతున్న అతడి
బంధాలకు సంకెళ్లు వేసింది
మానవత్వపు విలువలను ఏమార్చింది
మనిషిగా అతడి ఆలోచనలను నలిపేసింది
తాగిన ఆ క్షణం వరకూ 
అతను తాగేది అమృతం 
అతను చూసేది రంగుల చిత్రం
అతను ఊగేది భూతల స్వర్గం
అతనికి గుర్తుకు రానిది సంసారం
అతనికి స్నేహితులే ఎత్తైన శిఖరం
మత్తు దిగిన మరు క్షణం....
అతను తాగింది కాలకూట విషం
అతని చూపులు దీనాతి దీనం
అతనున్నది నరక కూపం
అతనికి దూరమయ్యేది సంసార బంధం
అతను  ఎత్తైన శిఖరాలు దాటి వెళ్ళి పోయేది
 స్నేహితులు తోడు రాని తిరిగి రాని లోకం 
మధ్యాన్ని మానండి
మానవీయతను చాటండి
మంచి మనిషిగా మారండి ,మారి జీవించండి
మనసైన వారి మదిలో 
మారణ  శూలాలు గ్రుచ్చకండి....

( విస్కీ డే సందర్భంగా )