అపరంజి బొమ్మంటి ఆ ఆకాశం
మీపై కవిత కట్టమని ఇచ్చింది ఆదేశం!
మెరుపుల్ని ముద్దాడు నల్లాని ఆ మేఘం,
మీ కవితలో తనకోచోటిమ్మని పంపింది సందేశం!
సప్తవర్ణాలతో ఇమిడున్ను -
ఇంద్రధనస్సులోని ఆ హావము...
మిము వర్ణించుటకై పంపింది
తన వర్ణాల బహుమానము.!
తూర్పు కొండల్ని దాటోచ్చే
ఆ తొలి కిరణం-
మిము వర్ణింప ... కలమున -
సిరాగా చెందింది రూపాంతరం!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి