స్వయంకృతాపరాధం ....!!:--కె.ఎల్వీ. హనంకొండ
 చెత్త వీదిలో 
విసిరేయడం 
సులభం !

చెత్త 
డ్రైనేజ్ నల్లా లొ 
పారబోయడం 
ఇంకా అనుకూలం !

మరి ,
మనం చెసే ఈ 
స్వార్ధ పూరిత క్రియ 
ఇంకొకరికి ఇబ్బంది 
కలిగించకూడదు కదా !

దీని ప్రభావం 
సమాజం మీద 
పడకూడదు కదా !

అందుకె ...
పెద్దలారా ...
పనిమనుషులారా ...
గృహిణులారా ....
కాస్త ఆలోచించండి!
ఆరోగ్య పరిసరాలకు 
అనుకూలంగా 
ప్రవర్తించండి.!!