100.ఆ.వె.పండితులకు తగదు పాడు గర్వము జూడ
దాని వదలి పెట్ట దక్కు కీర్తి
గౌడ డిండిముడును ఘనముగా నోడడే
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
101.ఆ.వె. చెట్ల వల్ల కలుగు చేటంత లాభము
ప్రాణవాయువిచ్చు ప్రజలకెపుడు
నిండు ఫలములన్ని నీరు పోసినగల్గు
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
102.ఆ.వె. పిల్లలడిగినంత పెద్దలు చెప్పక
కొట్టి తిట్టెదరుగ కోపముగను
సందియములు నంత సమసిపోవునయేమి
రమ్యసూక్తులరయు రామకృష్ణ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి