103.ఆ.వె. కన్నవారి ప్రేమ కర్కశంబును గాదు
వినుము వారి మాట విశదముగను
తల్లిదండ్రి మనకు దైవ సమానులు
రమ్య సూక్తులరయు రామకృష్ణ .
104.ఆ.వె. శాశ్వతములు కావు శత్రు మిత్రత్వము
నట్టనడుమ నిదియు నాటకంబు
గాత్ర ముండు వరకు గర్వము నణగదు
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
105. ఆ.వె.అంతరాత్మ మనకు నద్దమై యుండును
నీతి తప్పిన నది నిజము చెప్పు
నిమిష నిమిషమునకు నిన్ను బాధించును
రమ్య సూక్తులరయు రామకృష్ణ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి