విశ్వం మొత్తానికి భూగోళం ఒక మెదడు
దాంట్లో దాగున్నది టన్నులకొద్దీ విజ్ఞానం ఆకాశమంత అజ్ఞానం కానీ
ఈర్షా,అసూయ, ద్వేషం, కోపం,పగ పంచభూతాల్లాఅల్లుకుని ఉన్నాయి!?
సగం భూగోళం సముద్రం విషాదం సగం భాగం భూభాగం ప్రేమ!?
సహజ వనరులు ఆకలి దుఃఖం దరిద్రం
అక్కడ అక్కడ వజ్రాలు వెండి బంగారం ఆరోగ్యం ఆయుష్షు !?
అక్షాంశాలు,రేఖాంశాలు ఆశ నిరాశలు
భూగోళం ధనం జనం
జనన మరణాలు నిత్య కళ్యాణం పచ్చ తోరణం!?
భూగోళం స్వరాలు అరణ్యాలు
భూగోళం మెదడులో ఆలోచనలు పారే నదులు!?
పహారా కాస్తున్న సహారా ఎడారి ఎండిన భూగోళం గుండె
భూగోళం ఉత్తర దక్షిణ ధ్రువాలు చిన్న మెదడు పెద్ద మెదడు!?
భూగోళం మెదడులో కుడి ఎడమ కళ్ళు దయ జాలి!?
భూగోళం మెదడు కన్న కలలు సూర్యుడు చంద్రుడు!?
భూగోళం గుడివ్యాపారం భూగోళం బడి రాబడి భూగోళం ధిక్కారం అధికారం!?
మనిషి మెదడు రాజు
విశ్వానికి మెదడు భూగోళం
భూగోళానికి రాజు రాక్షసుడు!?
Pratapkoutilya
Lecturer in Bio-Chem
8309529273
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి