ఆదివారం, శలవు రోజుల్లో తప్ప రోజువారీ దినచర్య
సాధారణంగా ఉంటుంది.
ఉదయం నాలుగు గంటల ముందు నిద్ర లేచి మంచం
మీద డిసిప్లీన్ ప్రకారం నీలం దరీ పరిచి బ్లాంకెట్ , దోమతెర
సైజు ప్రకారం మడిచి మంచం చుట్టు నీటుగా ఉంచాలి.లేచింది
మొదలు ఉరుకుల పరుగుల దినచర్య.
ఎటువంటి మతం వారైనా ట్రైనింగ్ సమయంలో మత
సంబంధ వస్తువులు అంటే చేతికి తావీజులు,మెడలో జీసస్ శిలువ లాంటివి ధరించకూడదు. ఆదివారం, పండగ రోజుల్లో
వారి వారి మత ధర్మం ప్రకారం యూనిట్లో ధర్మ క్షేత్రాల్ని
దర్సించుకో వచ్చు.
మొదటి పీరియడ్ నలబై ఇదు నిమిషాల ఫిజికల్ ట్రైనింగ్
ఉంటుంది. కాకీ నిక్కరు ,వైట్ స్లీవ్ లెస్ బనియన్ నిక్కర్లో టక్
చెయ్యాలి. కాళ్లకి బ్రౌన కేన్వాస్ షూస్ ఉలెన్ సాక్స్ తొడగాలి.
రోజు షేవింగ్ చేసుకోవాలి. ఉదయం సివిల్ బార్బర్లు ఉన్నా
రద్దీ కొద్దీ స్వంతంగా గెడ్డం చేసుకుంటారు.చెంపల పక్క జుత్తు
పెరిగేలోపు హైర్ కట్ చేయించుకోవాలి. రోజు ఉదయం
గెడ్డం హైర్ కట్ చెకింగ్ చేస్తారు.
ఉదయం ఆరు గంటల లోపు సెక్షన్ కమాండర్ విజిల్ వేసే
సరికి సెక్షన్ రిక్రుట్సు బేరక్ ముందు మూడులైన్లలో నిలబడాలి.
మొత్తం అందరు సమావేశమైన తర్వాత లేట్ వస్తే
డడ్డూ చాల్ (ఫ్రాగ్ జంప్ )తో రప్పిస్తారు.ఒకవేళ ఎవరైన సిక్
ఐతే సిక్ పెరేడ్ అని వారిని వేరుగా లైన్లో ఉంచి మొత్తం అన్ని
ప్లాటూన్ల సిక్ రిక్రూట్సును మెడికల్ ఇన్పస్పెక్షన్ డిపార్టుమెంటు కు డాక్టర్ దగ్గరకు పంపుతారు. రిక్రూట్ శరీర పరిస్థితిని బట్టి
డాక్టరు మెడిసిన్ తో పాటు రెస్టుకు రిమార్కులు ప్రిక్రిప్సన్ మీద
ఎటెండ్ సి ఇస్తే రోజంతా రెస్టు అని అర్థం. అవుసరమైతే బ్లడ్
టెస్టులు రాస్తారు. మర్నాడు మళ్లా డాక్టరు దగ్గరకు వెళ్ల వలసి
ఉంటుంది.
ఒకవేళ ట్రైనింగ్ లో దెబ్బలు ఫ్రాక్చర్ లాంటివి సంభవిస్తే
ఎక్కువ సమయం మిలిటరీ హాస్పిటల్లో ఎడ్మిట్ ఐతే వారం కన్న
ఎక్కువ రోజులు పెరేడ్ కి ఏబ్సెంటు జరిగితే అన్ని వారాలు ఆ
రిక్రూట్ జూనియర్ అయిపోతాడు.సహచరులు సీనియర్
బేచ్ తో ముందుకు వెళతారు.
మిగత రిక్రూట్సును సెక్షన్ ఇన్ చార్జ్ మైదానంలో హవల్దారు
మేజరుకు అప్పగిస్తాడు. ఆయన మొత్తం కంపెనీ అన్ని ప్లాటూన్ల
స్ట్రెంత్ పేపరు మీద ఎంతమంది సిక్ లో ఉన్నది , మిగతా వారు
ఫిజికల్ ట్రైనింగ్ కి రెడీ అని వైట్ నిక్కరు వైట్ షర్టు వైట్ షూస్
తో ఉన్న కంపెని ఆఫీసర్ కి రిపోర్టు ఇస్తారు.ఈ ప్రోసెస్ అంతా
క్రమ పద్ధతిలో జరుగుతుంది.
తర్వాత రిక్రూట్సును ఫిజికల్ ఇన్ట్రక్టర్ కి అప్పగిస్తే
ఆయన నలభై నిమిషాలు మొదట పరుగు తర్వాత వివిధ
భంగిమల్లో డ్రిల్లు చేయిస్తాడు.రిక్రుట్సు నలబై నిమిషాల్లో
చెమటతో తడిసిపోతారు.తర్వాత హవల్దారు మేజరు
లాంగ్ విజిల్ ఊదగానే పి.టి. అయిపోయినట్టు. అందరూ
బేరక్స్ వైపు పరుగు. టైముంటే మొహం కడుగుతారు లేకపోతే
బ్రేక్ ఫాస్టుకు లైను పెడతారు.రెండు పూరి కూరతోపాటు మగ్గులో చాయ్ తీసుకుని డైనింగ్ హాల్లో తింటారు.వెంటనే
కేన్వాస్ షూస్ విప్పి పెరేడ్ కి లెదర్ బూట్ వేసుకుని నడుముకు
కేన్వాస్ బెల్టు ధరించి నెత్తి మీద ఫీల్డ్ టోపి పెట్టుకుని రెండవ
పీరియడ్ పెరేడ్ కి తయారవాలి. ఉదయం ఎనిమిది నుంచి
మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పీరియడ్ల ప్రకారం వివిధ
అంశాల్లో గ్రౌండ్ ట్రైనింగ్ ఇస్తారు.
ఒంటిగంటకు బేరక్ కి వచ్చి మధ్యాహ్నం భోజనానికి పెద్ద
ఎనామిల్ ప్లేటు , ఎనామిల్ మగ్గు పెద్ద స్పూనుతో పరుగో పరుగు.
ఎక్కడైనా లైను తప్పదు కనుక ప్రతి చోటా పరుగుల వాతావరణం. వరసగా నిలబడి మధ్యాహ్న భోజనంలో అన్నం ,
సుఖా రొట్లు , కూర ,సాంబారు, పెరుగు ఇస్తారు.డైనింగ్ హాల్లో
తాగే నీరు వాష్ బేసిన్ అన్నీ అందుబాటులో ఉంటాయి.
కొందరు బాటిల్సులో మంచినీళ్లు బెడ్ దగ్గర ఉంచుకుంటారు.
మధ్యాహ్నం భోజనం, విశ్రాంతి తర్వాత చాయ్, మళ్లా
మా చేత మైంటినెన్సు పనులు సాయంకాలం భోజనం
ఆరు గంటలోపే ఉంటుంది. లేట్ గా వెల్తే లంగర్ బందు
ఉంటుంది.
( మరికొన్ని ట్రైనింగ్ సెంటర్ విషయాలు తర్వాత)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి