మనందరి కోసం పిల్లలు రాసిన ఒక మంచి పుస్తకం : టి. వేదాంత సూరి --

 కాలం మారుతుంది. అభిరుచులు కూడా మారుతున్నాయి. ఐదు దశాబ్దాల క్రితం వచ్చిన కథల్లా ఇప్పుడు రాస్తే ఈ తరం పిల్లలు ఇష్టపడరు. వారికి ఏం కావాలో తెలుసుకుని రాయాలి. కానీ చాలా వరకు ఆలా జరగడం లేదు. పిల్లలకు ఇది కావాలి అని ఊహించి రాసిన  సాహిత్యమే ఇప్పుడు వస్తుంది. మరో వైపు ఈ తరం పిల్లలు ఒక అడుగు ముందుకు వేశారు. తాము ఇష్టపడే సాహిత్యాన్ని తామే సృష్టించుకుంటున్నారు . ఇది హర్షణీయం, కరోనా ప్రభావం తో ఇంటికే పరిమితమైన పిల్లలు కలం పట్టి అద్భుతమైన సాహిత్యాన్ని రాస్తున్నారు. ఈ నేపధ్యం లో కథలు, కవితల పుస్తకాలు  ఎన్నెన్నో పురుడుపోసుకున్నాయి. ఆ కోవకు చిందినదో మిస్ ? వి. డోంట్ రియల్లీ .. పదకొండేళ్ల జి. శ్రీ బాల సాయి తేజ, తొమ్మిదేళ్ల శ్రీ కార్తికేయ.
ఇద్దరూ హైదరాబాద్ వారే . ఈ పుస్తకం లో తమ అనుభవాలు వున్నాయి. అందరూ ఆచరించ వలసిన కొన్ని మార్గదర్శకాలు వున్నాయి. ఐదు అధ్యాయాల ఈ అపురూపమైన పుస్తకం పిల్లలే కాదు , పెద్దలు కూడా చదివి అబ్బుర పడతారు. ఈ తరం పిల్లల్లో ఆలోచనా విధానం గమనిస్తే ఆశ్చర్య పోవడం పెద్దల వంతు అవుతుంది. ఇప్పుడే ఇంత మంచి సాహిత్యాన్ని సృష్టిస్తున్న మన పిల్లలు భావైష్యత్తులో నోబెల్ బహుమతి వైపు అడుగులు వేయాలని ఆశీర్వదిద్దాం,. 
( మిస్ ? వి. డోంట్ రియల్లీ: -  జి. శ్రీ బాల సాయి తేజ,  శ్రీ  కార్తికేయ  పుస్తకం వెల 100 రూపాయలు. కావాలంటే ఫ్లిఫ్కార్ట్ . కం లేదా అమెజాన్ ద్వారా తెప్పించుకోవచ్చు .