పక్షులు మణిపూసలు(బాలగేయం):-- ఎం. వి. ఉమాదేవి
విదేశీయ విహంగాలు 
అందమైనవి ఆకృతులు 
మగ పక్షికి రంగు హంగు 
గట్టివే పెద్ద ముక్కులు !

గూడు కట్టు పక్షి కాదు 
నైపుణ్యం అసలు లేదు 
ఇతరుల ఖాళీ గూడును 
నివాసమే వదిలి పోదు !

చెట్టు తొర్ర రాళ్ల మధ్య 
పక్షి జంటలో సయోధ్య 
గుడ్లు పెట్టి పొదుగుతాయి 
బ్రతుకు తెరువు తెలుపువిద్య!

 ఒంటరి పక్షులు కాదూ 
సమూహాలు విడువలేదు 
మనిషికైన అదే గుణము 
సంఘ జీవితమే పోదు !

హార్న బిల్లు హంగు చూడు 
సృష్టి లోని వింత గూడు 
చెట్టును ఆశ్రయ మడిగెను 
ఒకరికొకరు మంచి తోడు !