ముత్యాలు కూరుస్తాను
శ్రామికుడా
నువ్వు చిందించే
చెమటబిందువులతో
రాయల్లే మొండిగా ఉన్న
ఈ భూమి గర్భం దాల్చి
జీవం పోసుకుంటోందన్నదే నిజం
శ్రామికుడా
నీ కష్టం రంగులద్దుకునే
ఈ భూమి మెరుస్తోంది
నీ చేతులు మురికిపట్టినకొద్దీ
భూమికి అందమొస్తోంది
నువ్వంకితం చేసిన
నీ శ్రమతోనే ఈ సమాజం
వికసిస్తోంది! పరిమళిస్తోంది!
నీ చెమట వాసనే
ఈ సమాజాన సువాసనై
వ్యాపిస్తోంది
నీ చేతులలోని గీతలే
ఈ దేశానికి చెరగని గుర్తులు
నువ్వు కష్టిస్తేనే
ఈ భూమితల్లి పట్టుచీర ధరించేది
నువ్వు రాళ్ళు
బద్దలు కొడితేనే
ఈ భూమరథానికి చక్రాలొచ్చేవి
ముందుకు సాగేదీ
తెలుసా నీకు
నువ్వు సేదదీరావో
పరుగుని ఆపుకుంటుందీ
ప్రపంచం
నా దృష్టిలో
తల్లీ నువ్వూ ఒక్కటే
తల్లి రక్తాన్ని పాలుగా మారుస్తుంది
నువ్వు దానిని చెమటగా మారుస్తున్నావు
శ్రమకు విశ్రాంతి ఇస్తే
తెల్లవారిని చూడటం అసాధ్యం
ఏ దేశానికైనా
ఏ మనిషికైనా
నా ప్రియమైన శ్రామికుడా
చెమటల సొంతదారుడా
నీ నుదుట ప్రకాశించే
ప్రతి చెమట బిందువూ
నా మాటల అల్లికలకు
ఆణిముత్యాలే
అవి నీకే అంకితం
మిత్రమా!
శ్రమిద్దాం
శ్రామికశక్తితో
చేతులు కలుపుదాం
పురోగతికి
చెమట విత్తనాలు
చల్లుకుంటూ పోదాం
సత్ఫలితాలే మనకు చేయందిస్తాయి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి