గోరింటాకు:-డా.కందేపి రాణి ప్రసాద్
చిట్టి చేతిలో గోరింటాకు
చిన్ని చేతిలో గోరింటాకు

ఆకు మెత్తగా రుబ్బి గోరింటాకు
ఆషాడ మాసం లోనా గోరింటాకు

ఎర్రెర్రగా చేతిలో గోరింటాకు
ఎర్ర మందారంలా గోరింటాకు

కాళ్ళకు పారాణి గోరింటాకు
కళకళలాడుతూ గోరింటాకు

సూరీడు చుక్కలా గోరింటాకు
సింధూర రంగులో గోరింటాకు

చల్లని చెంద్రవంక గోరింటాకు
చక్కధనాల మొగ్గ గోరింటాకు

ఆకాశంలో నక్షత్రాలన్ని దిగి
అరచేయిలో చుక్కలా ఒదిగి
అమ్మాయి మోముపై విరిసే
అమ్మ మన సెమూ మురిసె!