కరోనా ఉప్పెన(మణి పూసల గేయం)- ఎడ్ల లక్ష్మి , సిద్ధిపేట
కరోనా ఉప్పెనొచ్చె
గుండెలో భయము జొచ్చె
ఈ పాడు కాలమందు
ఒంటిలో బలము జచ్చె

ఊరు వాడ పుచ్చి పోయె
వైద్యశాల నిండి పోయె
నేలమీద పడకలతో
ఆక్సిజనే  అంద దాయె

గుడులు బడులు లేవాయె
వేడుకలే లేవాయె
ఒకరింటికి ఒక్కరు
వచ్చుడసలు లేదాయె
 
ఊరికి వెళ్ళకుండా
ఎవరిని చూడకుండా
ఇంటిలోనె బందీ ఖాన
బాధలు మనసునిండా

మాస్క్ మీరు పెట్టండి
దూరాన్ని పాటించండి
జాగ్రత్తలు పాటిస్తూ
దాన్నే తరిమి కొట్టండి