చిట్టి పాప బువ్వొద్దని అలిగి ఉన్నది
చిట్టి చిలక కథలెన్నో చెప్పమన్నది
బొమ్మలొద్దు గిమ్మలొద్దు పొమ్మన్నది
చెరువులోని చేప కథలు చెప్పమన్నది
పాటలొద్దు గీటలొద్దు పొమ్మన్నది
కోటలోని రాణెమ్మ కథ చెప్పమన్నది
బువ్వలొద్దు గివ్వలొద్దు పొమ్మన్నది
తోటలోని పువ్వులకథలు చెప్పమన్నది
వెండిగిన్నెలో గోరుముద్దలొద్దన్నది
చందమామ కథలన్నీ చెప్పమన్నది.
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి