అమ్మ దీవెన : ----డా . కె . ఎల్ . వి . ప్రసాద్ , హన్మకొండ

 ‘’ ఇల్లంతా ఎవరు ఇలా చిందరవందరగా తయారు చేసారు ?’’అంటూ లోప లోకి ప్రవేశించింది అమ్మ . 
అది శనివారం సాయంత్రం,చాలా పొద్దుపోయిన సమయం . అమ్మ రోజంతా ఆఫీసులోపనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చింది . సరాసరి మధ్య 
హాలులోనికి ప్రవేశించిన అమ్మ ,అక్కడి పరిస్థితి చూసి తోక తొక్కిన త్రాసులా లేచింది ! ఆ సమయంలో అమ్మను చూడాలంటేనే ,భయం వేసింది . 
శుచికి ,శుభ్రతకూ ,పెద్ద పీట వేసే అమ్మ ,ఆ వేళంతా చికాగ్గా కనిపించడా
నికి కారణం లేకపోలేదు --
హాలులో అందంగా పరచిన చక్కని కార్పెట్ నిండా ,పాప్ కార్న్ ముక్కలు 
చిందర వందరగా పడి వున్నాయి . నా స్నేహితులంతా సంతోషంలో మునిగి పోయి వాటిని ,ఒకరిమీద మరొకరు చల్లుకున్నారన్నమాట !
కార్పెట్ అంతా కూల్డ్రింక్ మరకలతో నిండిపోయి అసహ్యంగా తయారయిం
ది . హాలులో ఓ పక్క పళ్ళ మూకుడు తిరగబడిపోయి పడివుంది . నా .. 
స్నేహితురాలు ,ఆశ -వేసుకుతిరిగిన మురికి చెప్పుల మచ్చలతో  హాలం
తా ,దరిద్రంగా కనిపిస్తున్నది . మరో స్నేహితురాలు ,రీశా -అయితే ,నారిం
జ రసం ,సోఫా మీద పడబోసింది . చిన్న -చిన్న ,కేకు ముక్కలు ,సోఫా -
నిండా పది ,చెదిరి పడ్డ మంచు ముక్కల్లా కనిపిస్తున్నాయి . అంత మాత్ర
మే కాదు ,చీమలూ ,బొద్దింకలూ ,అప్పుడే అక్కడ గుంపులు ,గుంపులు
గా ,అక్కడికి చేరుకోవడం మొదలు పెట్టాయి . అందుకే మరి అమ్మకు 
అంత కోపం రావడానికి గల కారణం ,
అమ్మ కోపానికి ,ఒక పక్క వణుకు ,మరోపక్క భయం ,కలగా పులగంగా 
మారి ,మెల్లగా ---
‘’ నా స్నేహితుల వల్లనే ఇదంతా అయిందమ్మా !’’అన్నాను ,నెమ్మదిగా . 
‘’ నీ .. పుట్టిన రోజును ,స్నేహితులతో కలిసి ‘ నందనా .. హోటల్ ‘ లో 
జరుపు కోవాలని నీకు ముందే చెప్పాను కదా !పైగా ,ఆ .. హోటల్ 
మేనేజర్ తో మాట్లాడి ,అడ్వాన్సు కూడా ఇచ్చి వచ్చాను కదా ,విజయ్ ‘’
అంది ,అమ్మ కాస్త చిరాగ్గా . 
‘’ నిజమే ! అమ్మా .. కానీ ,నా . స్నేహితులు .. ‘’అని ఇంకా ,చెప్పబో--
తుండగానే ,నన్ను మధ్యలో ఆపేసి --’
‘’ నందనా హోటల్ లో ,నీ పుట్టిన రోజు పార్టీకి అన్ని ఏర్పాట్లూ చేయమని 
మేనేజరుకు ,సరిపడినంత డబ్బు కూడా ఇచ్చాను ‘’ అంది ,అమ్మ మరిం
త ,కోపంగా . 
‘’ నన్ను క్షమించమ్మా .. !’’ అన్నాను ,మెల్లగా గొణిగి నట్టుగా . 
‘’ అమ్మా .. నా .. స్నేహితులంతా ,నా బర్త్ డే -పార్టీ ,మన ఇంట్లోనే ఇమ్మ
ని ,పట్టు పట్టారమ్మా !అందుకనే … ‘’
‘’ మీ అమ్మ మాటకంటె ,నీ స్నేహితులే నీకు ముఖ్యం అన్న మాట !’’
అంది ,విసురుగా అమ్మ . 
‘’ ..... పైగా ,సాయంత్రం నీకు ఫోన్ చేసినప్పుడు ,.. నువ్వు - నందన లో 
ఉన్నామని ,అబద్దం కూడా చెప్పావు . ‘’ అంది అమ్మ . 
‘’ భయం పుట్టి అలా చెప్పానమ్మా .. అసలు ,వెంటనే నీకు అసలు విషయం ,చెప్పేసి ఉంటే ,ఈ సమస్య వచ్చేది కాదు ‘’ అన్నాను ,కాస్త 
బాధగా . 
జరిగిన సంఘటనతో -దుఃఖంతో ,నాకళ్ళు కన్నీటి చెలమలయ్యాయి . 
కోపంతో ఊగిపోతున్న అమ్మకు ,ఎదురుగా వుండాలనిపించ లేదు . 
ఈ లోగా -అమ్మ ,కోపంగా సర్రున తన గదిలోకి వెళ్లి ధడాలున తలుపు 
మూసి గడియ పెట్టుకుంది . 
ఇదే ,సమయమనుకుని ,గబ.. గబ.. తివాచీ మీద వున్నపాప్ కార్న్ 
ముక్కలు శుభ్రంగా ఏరిపారేసాను . సోఫా మీద ఏమీ లేకుండా శుభ్రంగా 
దులిపేసాను . 
సరిగ్గా ,పదిహేను నిముషాల తర్వాత అమ్మ తన గదిలోనుంచి హాలు 
లోనికి వచ్చింది . అమ్మ వచ్చేసరికి ,నేను చేయగలిగినంత శుభ్రం చేసి 
హాలంతా పరిశుభ్రంగా కనిపించే ప్రయత్నం చేసాను . 
రాత్రి భోజనం చేస్తున్నంత సేపు మాట పలుకు లేకుండా ,నిశ్శబ్దంగా ఉండి
పోయింది అమ్మ . భోజనం పూర్తికాగానే ,వంటగది శుభ్రంచేసి ,డైనింగ్ టేబుల్ నీట్ గా సర్దింది అమ్మ . తర్వాత ,తన అల్లిక -కుట్టు ,సూదులతో 
హాలులోకి వచ్చేసింది . టెలివిజన్ ఆన్ చేసి ,,అది చూసుకుంటూ ,స్వేట్టర్ 
అల్లడం మొదలు పెటింది అమ్మ . కాసేపటికి ,తొమ్మిదిగంటల వార్తలు మొదలైనాయి . అమ్మకు క్షమాపణ చెప్పి ,శాంతింపజేసే అవకాశంకోసం ,
నేను కూడా హాల్లోనే ,మరో సోఫాలో కూర్చున్నాను . 
ఆశ్చర్య కరంగా ,టి . వి -వార్తల్లో నందన -హోటల్ గురించిన ప్రత్యేక వార్త
అనుకోకుండా మా ఇద్దరి దృష్టిని ఆకర్షించింది . అమ్మ టి .వి ,వాల్యూమ్ 
మరింతగా పెంచి వినసాగింది . ‘ వరంగల్ హంటర్ రోడ్డు లోని ,నందన-
హోటల్ లో ,బాంబు పేలిన ఉదంతం ‘ ఆ .. ముఖ్య వార్త సారాంశం . ఆ .. 
వార్త విని ఇద్దరం ,శిలా ప్రతిమల్లా బిగుసుకు పోయాం . 
బాంబు పేలుడు వల్ల,హోటల్ లో జరిగిన విధ్వంసం కు సంబందించిన ఫోటో క్లిప్పింగులు చూపిస్తున్నారు . పగిలిపోయిన కిటికీ అద్దాలు ,చిందర 
వందరగా  పడిపోయిన కుర్చీలు ,బల్లలు ,నేలమీద పడి గుర్తించడానికి 
వీలు లేని మానవ శరీర భాగాలు ,రక్తపు మడుగులో పది వున్నాయి . 
                         సాయంత్రం సరిగ్గా 4. 30 కి ,బాంబు పేలుడు జారీ -
గిందట !ఆసమయంలో పుట్టినరోజు పండుగ జరుపుకోవాల్సిన ,ఒక 
బాలికల బృందం తమ కార్యక్రమం రద్దు చేసుకోవడం ద్వారా ,ఘోర -
ప్రమాదం నుండి తప్పించుకున్నట్టు .. టి . వి -స్క్రోలింగ్ పడుతోంది 
ఇది విన్న నాకు పుట్టెడు దుఃఖం పెల్లుబికి వచ్చింది . నన్ను చూసిఅమ్మ 
కన్నీళ్లు పెట్టుకుంది . నేను ఇక తట్టుకోలేక పరిగెత్తుకుని వెళ్లి అమ్మ వడి
లో ,వాలిపోయాను . నా దుఃఖానికి ఆనకట్ట పడడం లేదు . 
‘’ నా .. మాట విననందుకు ,ఈ వక్క సారీ నాకు ఆనందంగా వుంది తల్లీ’’
అంటూ ,నా తల నిమరసాగింది అమ్మ . 
‘’ .. అదే ,4. 30 కి ,మీరు అక్కడ పార్టీ చేసుకుని ఉంటే … ఏమయ్యేది !
ఆమ్మో !!’’ అంటూ ,నన్ను అల్లుకు పోయింది అమ్మ. 
‘’ అంతా .. దేవుడి కృప ,నీ దీవెన .. అమ్మా ‘’ అన్నాను ,అమ్మ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంటూ . 
                       ***         (ది హిందూ .. ఆంగ్ల దినపత్రిక సౌజన్యంతో )

కామెంట్‌లు