పెళ్ళికెళ్లిన నక్క (బుజ్జిపిల్లలకు బుజ్జికథ): దార్ల బుజ్జి బాబు

        పక్క ఊర్లోని కుక్కది పెళ్ళి.
       దానికి నక్క బయలు దేరింది. 
       సాయంత్రానికి వద్దాం అనుకుంది.
       పిల్లలను ఇంటి వద్ద వదిలేసింది. 
       కొత్త చీర కట్టుకుని ప్రయాణం అయింది.
       “అవ్వా! అవ్వా!! పిల్లల్ని కాస్త చూస్తుండు" అని పక్కింటి ఆవుకు చెప్పంది.
       "సరేలే, వెళ్ళరావే మనవరాలా" అంది ఆవు.
       "పిన్నావా! పిన్నావా!! పిల్లలు భద్రం. ఒక కన్నేసి ఉంచు" అని ఎదురింటి ఏనుగుకు చెప్పింది.
      “అలాగే వెళ్ళిరా కూతురా" అంది ఏనుగు.
      "అక్కా! అక్కా!! పోయి వస్తానే పిల్లలు జాగ్రత్త" అని చెప్పింది వెనకింటి ఎలుగుబంటికి.
       “పోయిరా చెల్లెలా" అంది ఎలుగుబంటి.
       నక్క పెళ్లికి వెళ్ళి పోయింది. 
       అది అలా పోయిందో లేదో నక్క ఇంటిలో పులి దూరింది.
       దాని పిల్లల్ని నోట్లో పెట్టుకుంది.
       పక్కింటి ఆవు, ఎదురింటి ఏనుగు, వెనకింటి ఎలుగుబంటి చూసాయి. 
       లబోదిబో మొత్తుకున్నాయి. 
       ఏమి లాభం?  పులి నోట్లోకి వెళ్లిన  పిల్లలు తిరిగి వస్తాయా?
       "అందుకే ఇతరుల మీద ఎప్పుడు ఆధారపడకూడదు"
కామెంట్‌లు