బాల భానుడు :-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
తూర్పు కొండల్లోన 
బాల భానుడదుగో 
తొలిగా  కిరణాలతో 
త్రోసు కొచ్చాడు !

నారింజ రంగులో 
నవ్వింది మబ్బు 
హాయిగా కూతలే 
పెట్టింది పులుగు !

అటు వెళ్లే గాలులు 
ఇటుగా వచ్చాయి 
చటుక్కున పువ్వులే 
విచ్చు కున్నాయి !

నిద్ర లేచిన చెట్లు 
బద్ధకం తోటి 
మంచు బిందువులను 
చాయ్ తాగాయి !

రహదారి ఒక పక్క 
ఒత్తిగిల్లింది 
వాహనాల గోల 
మొదలు అయ్యింది !

పాలు పేపర్ తోటి 
తెల్ల వారింది 
మేలు కొలుపులు 
పాడి ఉదయమయ్యింది!