ముందుకు రండి: -- యామిజాల జగదీశ్
 ఎన్.ఎస్. కృష్టన్....ఈయన తమిళ సినీనటుడు. తమిళులు ఆయనను "కళైవానర్" అని చెప్పుకునేవారు. భారత దేశపు చార్లీ చాప్లిన్ అని అంటుంటారు. 
ఓమారు జట్కావాలా (గుర్రబ్బండి తోలుకునే వారు) సంఘం ఎన్.ఎస్. కృష్ణన్ ని తమ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
ఆయన మాట్లాడుతూ "మీరంటే నాకెంతో ఇష్టం. ఇతరులలో ఉన్న అసూయ ద్వేషాలు మీలో రవ్వంతైనా లేవు. ఈ కాలంలో అలా ఉండటం నిజంగా కొనియాడదగింది. అందుకోసమే మీరు నన్ను పిలవగానే ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా వస్తానని ఒప్పుకున్నాను. మీ జట్కా ఎక్కేవారిని "మున్నుక్కు వాంగ... మున్నుక్కు వాంగ (అంటే ముందుకు రండి... ముందుకు రండి)" అని అంటారు. ఎక్కేవారెవరైనా కావచ్చు వారిని ముందుకు రండి అనే మీ మాట నాకెంతో ఇష్టమైన మాట. మీరెప్పుడూ బాగుండాలి" అన్నారు.
ఆయన మాటతో సభ చప్పట్లతో మార్మోగింది.