మార్పు కోరు ఉగాది ఆ.వె.పద్యాలు:--వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్, సిద్దిపేట.
8⃣2⃣6⃣

యుగములన్ని మారి యుక్తులు పెరిగాయి 
నక్కజిత్తులన్ని నాట్యమాడె 
ఒకరినొకరు దోచు నొనరుగా ముంచేరు 
కలియుగంబునందు కల్మషంబు 

8⃣2⃣7⃣

కాని పనులతోడ కాలంబు గడిపేరు 
మంచి పనులు జేయ మనసునొచ్చు 
పేరుకొరకు పాటు పొందుగా సిద్ధమౌ 
స్వార్థమెంతొ పెరిగె సగటుమనిషి 

8⃣2⃣8⃣

కొత్తవత్సరాన కోరికతగ్గించు 
వ్యర్థ ఖర్చులన్ని వదులుమయ్య 
ప్రజల కొరకు కొంత పాటుపడుటమేలు 
మనిషి జన్మయంత మధురమగును 

8⃣2⃣9⃣

పాతరోత పోవ పావనంబైదువు 
నూతనత్వ

మొచ్చినూతమిచ్చు  
దివ్యముగను బ్రతుకు దివ్య తేజంబుతో 
మనిషిలోన మార్పు మంచిజరుగు 

8⃣3⃣0⃣

మనిషి మారినంత మహిలోన వెలుగొందు 
మనసు మంచిదైన మాధవుండు 
నేటి నుండియైన నీతిగా మెదులుము 
నీతి కలిగినోడె నిజము మనిషి