కాకర కాయలు -బాల గేయం :--- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
కర కర కాకర వేపుడు తిన్నారా 
చిరు చిరు చేదు ఇష్టమన్నార? 
బెల్లమేసిన పులుసు బాగున్నది 
కమ్మగా ఇంకొంచెం తెమ్మన్నది !

కాయగూరల్లో సంజీవని కాకరా 
వంట్లో చెడు దింపేస్తది చూడరా 
ఉల్లిపాయ కారంతో ఉందోరుచిరా  
సెనగపిండి పకోడీల్ చేదుమర్చెరా!

వర్షాల్లో కాకరకాయ్ ఎలాగ? 
కమ్మగా ఊరగాయ్ ఉందిగా !
ఆవ,మెంతిపిండి కొత్తకారం 
పల్లినూనెతో కాకర రుచికరం!

పప్పు చారులోకి వేపుడుందా 
అల్లం కొబ్బరి మసాల కాకర 
లావుతగ్గే వాళ్ళకు కాకరరసం 
మంచిది అంటుంది ఆయుర్వేదం!


కామెంట్‌లు