జీవితం రహదారిపైన
బాల్యం చిరుజల్లులలో
తయారైన జ్ఞాపకాల కాలువ..
అనుభూతి కాగితం పడవగా..
అల్లనల్లన సాగుతూ...
కొన్నిబ్రతుకు పడవలు భద్రంగా
సాగుతాయి..
కొన్ని పరిస్థితుల అడ్డుపుల్లకు
బలై చిత్తుగా తడిసిమునిగిపోతాయి!
మనసు కుమిలిపోతూ...
గట్టి పడవలే చెయ్యాలోయ్
మునిగకుండా తేలేలా..
జంట పడవల యానం మధురం!
ఒకటి నొకటి అపుడపుడు తగులుతూ..
నీటి ఒరవడి తట్టుకుంటూ..
ముగ్ధులైపోతూ చూస్తూ..మనం
అన్ని పడవలూ ఎందుకు గమ్యం చేరవు?
చేరినా ఏముంది? మళ్ళీ మొదటి స్థానం నుండి యానమేగా?
జవాబు దొరకని చిక్కుప్రశ్నలు !
మునగని కత్తిపడవలా
నిర్మించిన జీవితం అదృష్టదేవత మునివేళ్ల స్పర్శ!
అవును కదా !
నా జీవితం కత్తిపడవలా
సాగించు దైవమా !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి