ప్రపంచం కళ్ళు తెరువక మునుపే తరువుల పత్ర హరిత మూలాల్లో
స్వాస్థ్యపు జాడలు వెదకి
కషాయాల్ని అందించినదీ దేశం!
బొట బొట కారే నెత్తురు మీద పసుపద్ది,
బఱ్ఱెoకాకుతో నొప్పిని తగ్గించిన దీ నేల!
జ్వర తీవ్రతను తగ్గించిన హస్తవాసి
నాయనమ్మ మింగించిన కస్తూరి వాత విధ్వంసి !
ఆశ్వినీ దేవతల వర ప్రసాదం అమృత గుళికలై స్పృశించినభారతీయ వైద్యం!
ధాతువును బట్టి విధాత రాతలోని
గుట్టును తేల్చిన వైద్యశిఖామణులు....
చరకుడు ,సుశ్రుతుల వారసత్వం ఈ గడపది!
పెంటలో పెరిగే పంటల మర్మం విశద పరిచిన జ్ఞానం... ప్రాచీనం నుండి అర్వాచీన వైద్య విజ్ఞానం దాకా మధించిన సముద్ర రసాయన
రహస్యాలు
ఇది .. మా మూతుల వాసనల గుభాళింపుకాదు నిజమైన మా తాతల గొప్పతనం!
పోరాటం లో భారతీయులెప్పుడూ ముందువరుస వారియర్స్
జ్ఞానాన్ని పంచె కొరియర్స్
గడ గడ లాడిస్తోన విషూచికను ఓడించడానికి కత్తులు నూరే మెదళ్లు!
నిద్రను నల్ల మబ్బుకు కట్టి
పగటి సంబరాల మూలకు నెట్టి
తయారు చేసిన
వాక్సిన్ వర పుత్రులారా
జయహో....జయహో
సాహస పథ గాములారా .. సాహో!
అంబానీ నుండి అల్పుడి దాకా
వరుసలో నిలబడి సూది ని
దింపుకోవల్సిందే!
మందు ప్రదాతలకు జేజేలు పలకాల్సిందే!
ప్రాణ దాతలకు ప్రణామం చేయాల్సిందే !
సర్వం ఒడ్డి సైనికులై జీవ పోరు మరొక్క మారు గెలవాల్సిందే!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి