నేనేమిటో ..!!:---కె.ఎల్వీ--హన్మకొండ
సాహిత్యాన్ని సాదన చెయ్యడం,
చిన్నతనంలోనే అబ్బింది.,

కవిత్వం రాయాలనే కొరిక ,
'ఇంటర్ 'లొనే మొదలయింది.,

పట్టుదలగా కాసిన్ని అక్షరాలు నేర్చి ,
కవిత్వానికి శ్రీకారం చుట్టాను.

కాసింత సరస్వతీ కటాక్షం కలిగి,
కథలు అల్లడం నేర్చుకున్నా .

పట్టుదల పరాకాష్టకు చేరి ,
అనుకున్నవ

న్నీ సాదించి ,
ఆత్మ విశ్వాసంతో బ్రతుకుతున్నా !

ఇప్పుడు __
నేను కవినా ?
కథకుడినా ?
వ్యాసకర్తనా ?____
నన్నెరిగిన పాటకులే చెప్పాలి మరి !!.

                         
కామెంట్‌లు