*సువర్ణాక్షరాలు*: --లీలా కృష్ణ.--తెనాలి
కలం కదిలించడమే.. కవి తంతు..
కథను కనిపెట్టుట.. మీ వంతు.

అంతెరుగని అలజడితో, చేస్తున్నా కసరత్తు..!!
నే కన్న కలలన్నీ.. మొత్తంగా మీ సొత్తు.

రాతిలో దాగిఉన్న గుట్టు
రట్టు చేసేంత వరకు..
సేదతీరనన్నది, శిల్పి చేతిలోని పనిముట్టు..!!

ఉవ్వెత్తున ఎగిసే అలలను..
చక్కని చిత్రంలో బంధించే వరకూ,
వీడనన్నది, రవి వర్మ పట్టిన పట్టు..!!

తొలి పొద్దు ఇచ్చే ముద్దు, అందే వరకు..
కదిలెల్లన్నది.. పుడమినంటిన చీకటి సిగ్గు..!!

గిలిగింతలు పెట్టే చుక్కల చూపు సోకనిదే..
పరిమళించనన్నది, మల్లె జాజుల సొంపు..!!

నా వైపు మొగ్గు చూపడమే..
మీకు దిక్కని, హితము పలికినది వేమన వాక్కు..!!

రేపన్నది  నిజమైతే..
నేడన్నది, నిన్నటి రేపే కదా..!!
ఈ నిజ మెరిగిన చాలు..
కనుమరుగవును కనికట్టు.