అందరికీ ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు: - గంజి భాగ్యలక్ష్మి
మనసు అచేతనమయినప్పుడు 
నా లో చేతనం నింపుతుంది 
నా "నేస్తం"
హృదయం అలసినప్పుడు 
నా గుండె గోడలపై నిలబడి
నాతో  సంభాషిస్తుంది నా "నేస్తం"
దగ్ధ స్వప్పాల బూడిద పైకి
లేవకుండా
ఆశల దుప్పటి కప్పుతుంది 
నా‌"నేస్తం "
మాటల తూటలు
ఈర్ష్యల శూలాలు
నొసల వెక్కిరింతలు 
కల్మషాల గరళాలు
నా మనసును గాయపరిచినప్పుడు
లేపనమై నా గాయాలను
మాన్పుతుంది నా "నేస్తం"
వెన్నుపోటులకు
నమ్మకద్రోహాలకు
చిరువ్వే ఆయుధమని
హితబోధ చేస్తుంది నా "నేస్తం"
కన్నీటిని సిరాక్షరాలుగా
మార్చమంటుంది
ఇరుకవుతున్న మనసుల మధ్య
విశాల హృదయమే
కొండంత బలమని చెప్తుంది
నా "నేస్తం"

అదెవరో తెలుసా? పుస్తకం
పుస్తకం నా మస్తక నేస్తం
పుస్తకం నా హృదయ విశాలం
పుస్తకం నా మనో వికాసం
పుస్తకం నా ప్రగతి సోపానం
పుస్తకం నా ఆత్మీయ నేస్తం..

------------------------

Dr. Ganji Bhagyalaxmi
Assistant professor of 
Zoology
Writer, Motivational speaker

కామెంట్‌లు