*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౮౮ - 88)

 కందము :
*వావిరి నీ భక్తులకున్*
*గౌరవమున నెగ్గుసేయు | గర్వాంధులనున్*
*దేవ! వధించుట వింటిని*
*నీ వల్లను భాగ్యమయ్యె | నిజముగ కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
వాసుదేవా, దేవాధిదేవా, నీ యందు నమ్మకము భక్తి నిలిపిన నీ భక్తులైన నీవాళ్ళకు కష్టాలు కలిగించిన దుష్టులను శిక్షించుతావు అనివిన్నాను.  నీ దయ వల్లనే కదా మాకు అదృష్టం, ఆనందం కలిగేది, దైత్యాంతకా!....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*గోవింద, జనార్ధన మాలోవున్న మోహము, గర్వము, పాప బుద్ది అనే దుష్ట రాక్షసులను అంతంచేసి తిరిగి మళ్ళీ నీ మార్గం లోకి మమ్మల్ని నడిపించే అసలైన శక్తి, యుక్తులు కలవాడివి నీ కదా! పార్థసారథి. నీ కరుణ జూపి మమ్మల్ని నీ మార్గంలో నడిపించు నళినదళేక్షణా!!!.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss