నానీలు --విద్యార్థుల వెతలు:-చంద్రకళ. దీకొండ,మల్కాజిగిరి,మేడ్చల్ జిల్లా.చరవాణి:9381361384

 1)చదివినవాడు
చదవనివాడు
సమానమే
మార్కులలో...!
2)విద్యార్థుల
భవిష్యత్తుకు
పరీక్ష పెట్టే
వాయిదాపడ్డ పరీక్షలు...!
3)కట్టాల్సిన
రుసుములో మార్పులేదు
బడి మూసినా
మూయకున్నా...!
4)విద్యార్థులకు
ఆటవిడుపు
టీచర్లకు
ఆన్లైన్ తలనొప్పులు...!
5)మూతబడిన
బడులతో
మొద్దుబారిన
విద్యార్థుల మెదళ్లు...!