*దేవుని పూజ*:-వరుకోలు మాధవి-గృహిణి,కవయిత్రి-గట్లమల్యాల సిద్ధిపేట జిల్లా-తరువాతి:9441782816.


 హస్మిత,వర్షిత లేచారు 
అమ్మా నాన్నకు మొక్కారు 
దీవెనలు తీసుకున్నారు 
చీపురు చేతబట్టి పట్టారు 
వాకిలినంతాఊడ్చారు
సానుపు నీళ్లు చల్లారు
నల్లానీళ్లుపట్టారు
కడపలనన్నీకడిగారు 
వర్షిత ముగ్గులు వేసింది
హస్మిత రంగులు నింపింది 
ఇద్దరు ముఖాలుకడిగారు 
శుభ్రంగా స్నానం చేశారు 
దేవునిగుళ్ళెకుపోయారు 
దేవుళ్ళనన్నీకడిగారు
పసుపు,కుంకుమపెట్టారు 
అగరు బత్తీలు ముట్టించారు 
కొబ్బరికాయ కొట్టారు 
వర్షితగంటకొట్టింది
హస్మిత హారతి ఇచ్చింది 
అమ్మానాన్నల పిలిచారు
హారతితీసుకోమనిఅడిగారు 
అమ్మ చాయ పెట్టింది
బిస్కెటు వేసుకతిన్నారు
నాన్న బజారు పోయాడు
ఆట బొమ్మలు తెచ్చాడు 
బొమ్మలతో ఆడుకుంటూ 
ఇంటిలోన గడిపారు.
హస్మిత,వర్షిత ఇద్దరు కూడ
ఎప్పుడు కలిసే ఉంటారు.

కామెంట్‌లు