-సోనూ సూద్ దాతృత్వం:-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
జనులార యితడెంత జాలిహృదయమ్మునో 
తలపోయగా తాను తప్పకను సాయపడు

ఎటువంటి పుణ్యమో  ఏదైవ మోనితని 
మానసము నిలచెనా మహిమాన్వితముగాను  

విషగాలి వేదనకు విలవిలా తన్నుకొను 
పీడితుల పాలిటను పిలువగా నూపిరయి 

ప్రాణదీపము నిల్పు ప్రతిమయా గుడిలోని 
సంపదలు పరిచాడు సమృద్ధిగా నౌరా 

మానవత పరిమళము మహిలోన యలముకొని 
ఆహార విహారము ఆవాస సాయమును 

వలసలో జనులెల్ల వాపోవు సమయాన 
స్వస్థలము చేరుటె స్వస్థతని తెలియగ

చేతులెత్తియు మొక్కి చెప్పిరిగ కూలీలు 
బంగారు మనిషయ్య బహుమంచి సోను సూద్ !

విశ్వాస భారతికి వెలుగిచ్చి నాడమ్మ
కోట్లజనులకి తాను కోవెలలో దైవము !!