*మార్ తాండో(మా తండా)..-- శ్రీ రాథోడ్ శ్రావణ్



       అదగదిగో మా తండా
     అందమైన మా తండా
     పచ్చని చెట్లుతొ నిండా
     పక్కన నాగల్ కొండా...!! 
తండా గురించి ముత్యాల హారం... రూపకర్త రాథోడ్ శ్రావణ్...
జననీ జన్మభూమిశ్చ...
స్వర్గాదపీ గరీయసి ,
స్వర్గాదపీ గరీయసి.
ఏ తల్లి నిను కన్నదో‌.....
ఆ తల్లినేకన్న భూమి గొప్పదిరా................అన్నాడు  
 ఒక మహాకవి.
"ఉన్న ఊరు కన్నా తల్లి"
 "జన్మనిచ్చిన యాడితో సమానం మన తండా"
మా తండా సోనాపూర్    తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఒక గిరిజన రెవెన్యూ గ్రామము. ఇది మండలానికి 8 కి,మీ దూరంలో ఉట్నూర్ పట్టణానికి 20 కి,మీ దూరంలో ఉంది. చూట్టు మూడు వైపూల గుట్టల నడుమ గ్రామాన్ని "U"ఆకారంలో చుట్టుపక్కల గుట్టలతో అడవులు ఆవరించి ఉంటుంది.అణువు అణువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతోంది.గుట్ట ప్రాంతంలో ముఖ్య వృక్షాలు టేకు, ఇప్పా, తునకి,జమ్మి,రేగి, సారా,అందుగ,రావి,జిడి,మేడి,తావిజి,కొడిసా, మొదుగ, మర్రి,తుమ్మ,నల్లమద్ది, తెల్ల మద్ది,చిన్న,చిన్న పోదలతో చూడడానికి ఆకర్షణియంగా కన్పిస్తుంది. పాడి పంటలతో పచ్చని పొలాలు, చిన్న చిన్న వాగుల మధ్య రమణీయంగా కళకళలాడుతూ ఆర్థిక పునరుజ్జీవనం వైపు అడుగులేస్తోంది.ఈ ప్రాంతంలో లంబాడీ, గిరిజనులు,గొండులతో పాటు గిరిజనేతరులు, ఇచ్చట జీవనం సాగిస్తున్నారు.ఈ తండాకి వచ్చెవారు తండా దగ్గర వరకు వచ్చిన ఊరు కన్పించకుండా అందమైన అనుభూతి నిస్తుంది.   2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ తండా జనాభా 218 ఉంది. గ్రామంలో మగవారు 118 ఆడవారు 100 తెలంగాణ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలో భాగంగా గ్రామ పంచాయతీ బేతాల్ గూడలో గ్రామంలో ఉంది.  పోలిష్ పటేల్ వ్వవస్థ కాలంలో  తండాలో జాదవ్ మోహన్ సింగ్ నాయక్ గారు తండా చుట్టూ ఉన్న ఎనిమిది, నుండి పది గ్రామాలకు పోలీషుపటేల్ గా వ్యవహరించడంతో పాటు తండాకు నాయక్ గా వ్వవహరిచేవారు.అతనితో పాటు అతని తమ్ముల్లు, జాదవ్ లాల్ సింగ్, జాదవ్, గూలాబ్ సింగ్, బందువులు  రాథోడ్ చంద్రభాణ్,‌రాథోడ్ అమృ, రాథోడ్ రతన్ సింగ్,గ్రామ కారోభారి జాదవ్ రాంచందర్, జాదవ్ భావ్ సింగ్, రాథోడ్ హారిలాల్, కాశీరాం, మేగాజీ, ఖుబా  తో పాటు కిషన్ పల్మటే, బాబు రాజపేటే, మొదలగు వారి వంశమే ప్రస్తుత సోనాపూర్ గ్రామము.వీరి ప్రధానమైన జీవన ఆధారము వ్యవసాయం చేయుట అటవీ ఉత్పత్తులను సేకరించి అమ్ముట ప్రధానమైనది. వాణిజ్య పంటలు పత్తి, మరియు సోయా, జోన్నలు, మీనుములు, పేసర్లు,కందులు,ఉలువలు తో పాటు వరి, గోధుమలు,శేనగలు, పండించే వారు.అడవిలో దొరికే ఇప్పపూలు,బీడిఆకులు,బంక, సారాపలుకులు మొదలగునవి సేకరించి అమ్మేవారు.తండా నాయక్ మోహన్ సింగ్ పెద్ద కూమారుడు శ్రీ జాదవ్ కిషన్ సింగ్  రిటైర్డ్ ఉపాధ్యాయులు గారు ప్రస్తుతం తండా నాయక్ గా కొనసాగుతున్నారు. కారోభారి జాదవ్ పర్సురాం గారు, డావ్ అంబారావ్,మాన్కరి మేర్ సింగ్ వ్యవహారిస్తున్నారు. జాదవ్ కిషన్ సింగ్ కోడలు సుజాత పరమేశ్వర్ గారు  తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన తండాలను గ్రామపంచాయతీలో భాగంగా  కొత్త  ‌ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో ఐటిడిఎ పరిధిలోని ఒక ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రం, గ్రామంలో ఒక ఆశ వర్కర్లు ‌ఉంది.పాత విద్యుత్ స్తంభాల స్థానంలో గ్రామములో కొత్త ‌విద్యుత్తు స్తంభాలు  ఏర్పాటు చేసి విద్యుత్తు సరఫరా వ్యవస్థను  కొనసాగిస్తున్నారు.సర్పంచి మరియు గ్రామ పంచాయితీ కార్యదర్శి ఆధ్వర్యంలో రోజు వారి  సంపూర్ణ పారిశుధ్యం అమలవుతోంది.తెలంగాణకు హారితహారం లో భాగంగా రోడ్డు ఇరువైపులా చెట్లు నాటినారు. రక్షిత మంచినీటి సరఫరా కుమ్రంభీం ఆడ ప్రాజెక్టు నుండి నీళ్ళు, ఇంటి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంచుటకు సహకరిస్తున్నారు. వైద్య సౌకర్యాం కొరకు గ్రామ ప్రజలు తాడిహడప్నూర్ , మరియు ప్రభుత్వ ఆసుపత్రి ఉట్నూర్ కు రావడం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రి రిమ్స్ కు వెళ్లుతుంటారు.గ్రామ అక్షరాస్యతను పరిశీలిస్తే ప్రతి ‌ఇంట్లో చదువుకున్న వారు కనిపిస్తారు.తండావాసులు చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వలన గ్రామ అక్షరాస్యత 96% ఉంది. చదువుకున్న వారు దేశంలో ఎక్కడికైనా వెళ్ళి బ్రతకగలడు అనే అభిప్రాయానికి వీరు ఏకిభవిస్తారు. ఈ తండా నుండి ఉపాధ్యాయ వృత్తిలో ఏడుగురు,భూకోలతల శాఖలో ఒకరు  పోలిష్ ఉద్యోగంలో ముగ్గురు  అప్కారిశాఖలో ఒకరు అటవీ శాఖలో ఒకరు  ఇంటర్మీడియట్ విద్యా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకరు, ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖలో ఒకరు రవాణా శాఖలో ఒకరు  కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సైజ్ శాఖ లో ఒకరు
 మరియు వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ ఇద్దరు పనిచేయుచున్నారు.ఈ తండా నుండి మొట్టమొదటి ఉద్యోగి జాదవ్ గూలాబ్ సింగ్ మాస్టర్  గారు , మొట్టమొదటి ఇంజనీరింగ్  చదివినా జాదవ ప్రేమ్ సింగ్ గారు ప్రేంఖైదీ సినిమా యందు రెండో నటుడుగా నటించారు. వీరి తమ్ముడు జాదవ్ నారాయణ సింగ్ ప్రముఖ గాయకుడు వీరు గోర్ జీవన్ బంజారా సినిమా యందు నటిస్తూ  మధురమైన రాగంతో పాటపాడడం విశేషం. మొట్టమొదటి గెజిటెడ్ అధికారి శ్రీ రాథోడ్ శ్రావణ్ గారు వీరి కుమారుడు డాక్టర్, రాథోడ్ కార్తీక్ నాయక్ ‌గారు ఎం‌బిబియస్ ‌పూర్తి చేసి ప్రస్తుతం పీజీ కోర్సుల‌‌ కొసం ప్రయత్నంలోన్నారు.రెండో గెజిటెడ్ అధికారి జాదవ్ సంజయసింగ్ గారు, తండాలో పదవ తరగతి, ఇంటర్ తో పాటు డిగ్రీ కొర్సులో చదువుతున్నావారు 38, ఇంజనీరింగ్ చదివి వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారు 4, ఇంజనీరింగ్ ప్రస్తుతం చదువు చున్నావారు 4, యన్.ఐ.టి  గోవా రాష్ట్రంలో చదువుతున్నవారు 01, మరియు ఎమ్ టేక్ చదివి   పిహేచ్ డి చెస్తున్నవారు 01,ఇలా చదువు పై ఉన్న మమకారంతో ముందుకు సాగుతున్నారు. తండాలో రేండు ఆలయాలు ఉన్నాయి . 1)ఒకటి ఆంజనేయ స్వామి ఆలయం,2) రెండోది‌ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ , జగదాంబ మాత ఆలయం.
1) ఆంజనేయ స్వామి ఆలయం :- ఆలయాన్ని గ్రామస్తులందరి సహకారంతో పాటు జాదవ్ జైతరామ్ గారి సహకారంతో ఆలయాన్ని నిర్మించారు. తండా నాయక్, కిషన్ సింగ్ గారు, వసంత్ సింగ్ గారు వీరితో పాటు ఆలయ పూజారి హూన్నాజీ గారు స్వామి వారికి సుప్రభాతం మరియు ఆరాధన చేస్తుంటారు.స్వామి వారి జయంతి కంటే ముందు తమకు తోచిన విధంగా దీక్షలు పట్టి కొందరు 11రోజులు,21రోజులు, లేదా 41రోజులు, ఆంజనేయ స్వామి, మరియు సేవాలాల్ దీక్షలు తిసుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేసి దీక్ష విరమణ చేస్తారు.స్వామి వారు కొరుకున్న కొరికలు నేరవేస్తాడని భక్తుల విశ్వాసం.ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో శ్రావణమాసంలో పోలాల అమావాస్య అత్యంతవైభవంగా నిర్వహిస్తారు. 2) సేవాలాల్ మరియు జగదాంబదేవి ఆలయం:-  బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జగద్జనని జగదాంబదేవి ఆలయాన్ని గ్రామస్తులందరి సహకారంతో  జనవరి/2021న నిర్మించారు. స్వామి వారి జయంతిని ప్రతిఏటా నిర్వహిస్తుంటారు. ఆలయం పూజారి రాథోడ్ గణేష్ ఆలయం యొక్క బాగోగులు చూస్తూంటారు. ఆలయం  నిర్మాణినికి విశేష కృషి సల్పిన ఆలయ అధ్యక్షులు రాథోడ్ బలిరాం ఉపాధ్యక్షులు రాథోడ్ ధన్ లాల్ , తండా నాయక్ తో పాటు తండావాసులు సహకారంతో శిలావిగ్రహాన్ని ఏర్పరచడం ఆనంద దాయకం. బంజారాలను  సంచార జీవనం నుండి సన్మామార్గంలో బోధించి తండాలలో స్థిరనివాసం ఏర్పరచి చైతన్యతను తేచ్చి ఆధ్యాత్మికం వైపు మళ్ళించిన మహోన్నత వ్యక్తి  తమ జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని వీరి నమ్మకం.తండా కేంద్రంగా అందరూ కలిసి మేలసి సమభావం, సహజీవనం సాగిస్తూ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ సమతా విలువలతో జీవిస్తూ అప్యాయాలు, ఆత్మీయతలకు నిలయాలు ఈ తండావాసులు. అందుకే తండా ప్రేమాభిమానాలకు ఆండా అంటారు.... రాథోడ్ శ్రావణ్.

--*రాథోడ్ శ్రావణ్*
ముత్యాల హారం రూపకర్త
పూర్వ అధ్యక్షులు ఉట్నూర్ సాహితీ వేదిక ఉట్నూర్, గ్రామము సోనాపూర్ ,నార్నూర్ ఆదిలాబాద్ జిల్లా. 9491467714