సీస పద్యం :
' భారత రత్న ' ము , మదరు థెరీసా యె ,
ఆగ్నెసు , యీమెకు అసలు పేరు ,
యేసు ప్రేమను పొంది, యీతని ఆజ్ఞతో ,
ఆశ్రితనాధ, అన్నా ర్తులకును ,
నిర్మల శిశుభవ నేర్పర్చి , అందుంచి ,
ఆహార , ఆరోగ్య అవసరాల,
సేవ లందించిన సేవకు రాలీమె ,
కలకత్త లోనుండ కట్టుబడియె ;
తేటగీతి
ఈమె నిస్వార్థ సేవల యిలను నున్న ,
నోబెలు , మెగాసెసె బహుమ తులను పొందె ,
లోక మంతటికి వెలుగై స్ఫూర్తి నింపె ,
భరత మాత సిగలొ పూవె ... భాగ్యశాలి !!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
జననం : 26-08-1910---5-9-1997 :మరణం
మదర్ థెరీసా కు -- స్మృత్యంజలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి