దారిదీపం: :-- దోర్బల బాలశేఖర శర్మ

 ఇవాళ ఒక ఆనందయ్య వెలుగులోకి వచ్చారు. ప్రపంచానికి తెలియని మన వైద్య నారాయణులు ఇంకెందరో. ఎవరో చంపేస్తే చచ్చేది కాదు, మన సనాతన విజ్ఞానం. వేప, నిమ్మ, తులసి, పసుపు వంటి భారత దేశీయ మొక్కలు, వృక్షాలు, వనమూలికల విలువను, గొప్పతనాన్ని ఇప్పటికైనా తెలుసుకుందాం. ఇకనైనా విదేశీ మొక్కలపై, జీవన విధానాలపై మోజును వదిలేద్దాం. మన ప్రభుత్వాలు హరిత హారాల్లో, రోడ్లపక్కన మన దేశీయ మొక్కలనే నాటేలా చర్యలు చేపట్టాలి. ఆయుర్వేద వైద్య విజ్ఞానంపై తక్షణం పరిశోధనలకు ఉపక్రమిద్దాం.