కలిసుందామ్ రండి..!!:- ----డా.కె.ఎల్.వి.ప్రసాద్, హనంకొండ
కలిసుందాం రండి 
బంధువులారా 
కలిసిపోదాం రండి ! 

రక్త సంభందీకులారా 
రండి ..రండి.....
ప్రేమను పంచుకుందాం రండి !

కడుపు చేతబట్టుకుని 
కొందరు .......
వృత్తిని నమ్ముకుని 
మరికొందరు ........
'ఇగో 'లు 
మూటకట్టుకుని 
కొందరు ..............
గతిలేక ....
గత్యంతరం లేక 
ఎందరెందరో బంధువులు 
చెల్లా చెదిరి 
ఎక్కడెక్కడో 
బ్రతుకుతున్న చరిత్రలు .
ఒకరికొకరు ,
ఆగంతకుల మాదిరి ,
గుర్తిన్చుకోలేని 
దౌర్భాగ్యం ....!!

ఆస్తులు ..అంతస్తుల 
గాలి మేడలు 
ఆత్మీయతలను 
అనురాగ ...ప్రేమ  బంధాలను ,
కొల్లగొడుతున్న 
దుర్మార్గపు దృశ్యాలు ,

వంశ వృక్షాల కొమ్మలు 
విరిగి ,వేరై పొతున్న 
సందర్భాలు ,

మనసుండి 
ఆలోచించే వారి మనస్సు 
ద్రవించి పోతుంటుంది .
అందుకే ....
బందువులారా రండి !

కలిసుందాం రండి ..j
ప్రేమలు ....
పంచుకుందాం రండి !!