మనో ధైర్యమే ప్రధానం: -డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్. శ్రీ శ్రీ కళా వేదిక కార్యదర్శి

 కరోనా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళాలంటే వైద్య, ప్రభుత్వ రంగాలు చేస్తున్న కృషి తో పాటుగా ప్రతి పౌరుడు తన కంటూ ఒక బాధ్యతగా ప్రవర్తిస్తూ  సమాజంలో తను  స్వియ నియంత్రణ, భౌతిక దూరం వంటి నియమాలు పాటించడంతో పాటు సాటి వ్యక్తికీ ఎవరికి కూడా కరోనా  బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ తన బాధ్యత నిర్వర్తించాలి. అంతేకాకుండా సాటి కరోనా బారినపడిన వ్యక్తికి  ధైర్యాన్ని అందించాలి. అప్పుడే కరోనా ని జయించే మార్గం సులభతరం అవుతుంది. అప్పుడే ఎందరో మందిని రక్షించి మానవ మనుగడకు దోహదం చేసిన వాళ్ళం అవుతాం. ఇటీవల ఒక ప్రకటనలో డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ తెలిపారు