షాడోలు (క్రీనీడలు ) కలువలు :--- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
వెన్నెల కలువలు 
కన్నుల మెరుపులు 
కమ్మని ఊహలు 
కొలనుకు కళగా భామ ఉమా!

చంద్రుని కిరణం 
మానస హరణం 
ప్రేమకు భరణం 
ఇచ్చిన కలువల మెప్పు ఉమా!

వెదురున గొడుగును 
వదిలిన బెదురును 
కదలిన పడవను 
మంచున తడిసిన కలువ ఉమా!

శారద రాత్రులు 
నీరద గాత్రులు 
నిమిత్త మాత్రులు 
నిశ్చల అందం ఇదే ఉమా!