అహం..కథ..అచ్యుతుని రాజ్యశ్రీ

 ఎవరికీ అహంకారం  నేనే గొప్ప  నన్ను మించిన వాడులేడు అనే భావండటం మంచిది కాదు. అందం శాశ్వతం కాదు. వయసు పెరుగుతోంటే మనలో బలం అందం క్రమంగా తగ్గుతుంది. ఓచిన్నకథ చెప్పుకుందాం. ఆ చిన్న అడవిలో చిన్న చితక జంతువు లు సరదాగా గడిపేవి.క్రూరమృగాల భయం లేదు. పిట్టలు ఎలుక  కుందేలు ఇలా ఎగిరే నేలపై సంచరించే జీవులు  చెట్ల దగ్గర  కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవి.నెమలి మాత్రం కాస్త  గర్వంగా  ఠీవి గా  తనే వనానికి రాణి  అన్నట్లు  ప్ర వర్తించేది. ప్రతివాటినీ ఏదోవిధంగా వెక్కిరిస్తు కొక్కి రించేది.ఆపై వయారాలు ఒలకబోస్తూఎంచక్కగా పాడుతూ నాట్యం చేసేది. మిగతావి చూసి ఆనందంగా అభినందించేవి.అమాయక మూగజీవులవి.కానీ మయూరంకి గర్వం అహంకారం పెరిగి ప్రతి వారిని విమర్శించటంతో అవి అన్నీ దీని తో మాట్లాడటం మానేశాయి. దూరం గా వెళ్ళి పోయేవి.కొన్ని రోజులు  నెమలి  కూనిరాగాలు తీస్తూ ఒంటరిగా  డాన్స్ తో అంతా తానే అనేలా ప్ర వర్తించే ది. ఒకరోజు ఆ అడవికి ఆనుకుని ఉన్న పల్లె ను చూసింది. ఇద్దరు ఆకతాయిలు  దాని తోకపట్టి బాగా గుంజసాగారు.హఠాత్తుగా జరిగిన  ఈఘటన తో అది బెంబేలెత్తి పెద్దగా  అరుస్తూ  పరుగెత్తింది.ఎలాగైతేనేం  చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు తన అడవి చేరి సొమ్మసిల్లి పడిపోయింది. అంతే అక్కడున్న  జంతువులన్నీ ఉపచారాలు చేశాయి.  పిట్టలు తమరెక్కలతో గాలివిసిరితే కుందేలు  నీరు తెచ్చి  దాని  నోటి లో పోసింది. కాసేపటికి నెమలి తేరుకుంది.తోక లేదు. కోడి ఈకలా మారింది. భోరున ఏడవ సాగింది. దాని గొంతు  శాశ్వతం గా బొంగురుపోయింది.నెమలి  గర్వం అహంకారం అణిగాయి. బుద్ధి తెచ్చుకొని  అందరికీ తలలో నాలుకలా మారింది. నలుగురితో మంచి గా ఉండాలి. కానీ మరీ చనువుగా ఉంటే మనకొంప ముంచుతారు అసూయతో.ఎక్కువ గా అతివాగుడు ప్ర మాదంసుమా !