నాడిని పట్టిన అభయ హస్తం
నమ్మకాన్ని నిలబెట్టు దరహాసం
వైద్యుడే కదా ఆపన్న హస్తం.
ధన్వంతరి, చరకుని వారసులు
అవనిలోన వైద్యులే,. దేవతలు
కృత్రిమ శ్వాశను పొసే మరో అమ్మ
కృత్రిమ గుండెను అమర్చే
మరో సృష్టికర్త బ్రహ్మ
చిరునవ్వులే స్టెత స్కోపుగా
భద్రతా భావమే తెల్ల గౌనుగా,
రాత్రీ ,పగలు సేవ చేస్తూ,
సమానత్వం పాటిస్తూ
శస్త్ర చికిత్సలతో,ప్రాణం పోసి
ఆత్మ స్థైర్యంతో రోగాన్ని మాయం చేసి
ఓపికతో ఓదార్పు నిచ్చే కరము
ఔదార్యంతో చేయు
వైద్యమే మనో ధైర్యము..
మందుల చీటి బ్రతుకు పెంచే
నుదుటి రాతలుగా,
రోగాన్ని తగ్గించే మాత్రలు,
అమృత గుళికలుగా,
సహనంతో, సౌశీల్యంతో,
సంస్కార భావంతో ఉన్న
నిలువెత్తు రూపం
వైద్యో నారాయణ అని స్తుతించే
మనిషి
భవిష్యత్తు ముందుంచే
వైద్యుడే కదా మహర్షి
ఆత్న బంధువు అతడు
పునర్జన్మ అందించు ఆపద్భాంధవుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి