తాతయ్య కథలు-50.:- ఎన్నవెళ్లి రాజమౌళి

  అప్పు చేసి పప్పు కూడు తిన వద్దు రా... అని తాతయ్య నాన్నతో అంటుంటాడు. అలా అంటే ఏమిటి నానమ్మ. మనవరాలు అడిగేసరికి -
అదా... దేనికి పడితే దానికి అప్పు చేయకూడదు. ఉన్న కాడికి తృప్తి పడాలి. తప్పనిసరి అయితే అప్పు చేయవచ్చు. అని నానమ్మ అనగానే...
అవును నానమ్మ నీవు అన్నట్లే... మా మేడమ్ పద్యం చెప్పింది.
ఏమి పద్యం అమ్మ అది-
ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు/పప్పు లేని కూడు పాడి కాదు/అప్పు లేని వాడు అధిక సంపన్నుడు/విశ్వదాభిరామ వినుర వేమ.
బాగా ఉందమ్మా పద్యం. ఈ పద్యం వందల సంవత్సరాల క్రితమే వేమన చెప్పాడు. అందుకొరకే తాతయ్య నాన్నతో అప్పు చేయకుమని చెబుతుంటాడు.
అప్పు అంత ప్రమాదమా నానమ్మ... అవును మిత్తి కి మిత్తి కట్టి కట్టి సంసార రాలే దెబ్బతింటాయి తెలుసా...
బాగా చెప్పావు నానమ్మ బై నేను  చదువుకోవాలి అంటూ మనవరాలు అక్కడినుండి వెళ్ళింది.
కామెంట్‌లు