అనగానగా ఒక దట్టమైన అడవి ఉండేది. అడవి చివరలో ఒక చిన్న గ్రామం ఉండేది.ఆ గ్రామం లో కుక్కలు క్రూరంగా ప్రవర్తించేవి కొత్తగా ఎవరైనా కనిపిస్తే అతని పై దాడి చేసి గాయపరిచేవి ఆ ఊరి నుండి ప్రయాణమై వేరే ఊరికి వెళ్ళడానికి అడవి మార్గమే ఉండేది ఆ గ్రామం లో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. అందులో రంజిత్ అనే కుర్రాడికి కరాటే చేయడం వచ్చు కానీ రాహుల్ కి తెలివితో ధైర్యాన్ని ప్రదర్శించడం తెలుసు.
ఒక రోజు రాము అడవి నుండి వెళ్తుండగా ఆ కుక్కలు రంజిత్ పై దాడి చేస్తాయి. అతను భయం తో తనకు కరాటే వచ్చానే విషయం మర్చిపోయి వాటికి చిక్కి గాయాలపాలైపోతాడు.
అదే దారి నుండి రాహుల్ వెళ్తాడు. అప్పుడు కుక్కలు దాడి చేయగా ఇతను తెలివితో అక్కడ ఉన్న కర్రలతో వాటి పై తిరిగి దాడి చేస్తాడు అప్పుడు కుక్కలు భయపడి దూరంగా పారిపోతాయి మరల ఇప్పుడు రాహుల్ ఆ దారినుండి వెళ్లిన అవి అతని దగ్గరికి వచ్చేవి కావు రాహుల్ ని చూసి భయంతో పరిగెత్తేవి.దీన్నిబట్టి పిల్లలూ శారీరక దృఢత్వం ఉన్నా మేధస్సు,ధైర్యం లేకుంటే లాభం లేదు అని తెలుసుకోండి..

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి