పెరుగన్నం పిల్లి కి పెట్టు అని తాతయ్య నానమ్మ తో చెప్పగానే-ఆ... ఇప్పుడు పిల్లికి అన్నం లేకుంటే ఏమైంది.
నీవు పిసినారివి. పిల్లికి కూడా బిక్షం పెట్టనివాళ్ళు ఉన్నారంటే... నీ లాంటి వాళ్ళే కావచ్చు.
అది సరే! నానమ్మ తో ఏంది. నేను వెళ్లి పిల్లికి అన్నం పెట్టి వచ్చాను కానీ.. ఇంతకు ముందు నానమ్మ తో అన్నావు చూడు... అసలు పిల్లికి బిక్షం పెట్టది. అంటే ఏమిటి తాతయ్య. భిక్షము అంటే ఇక్కడ అన్నము.
పిల్లిని ఎందుకు పెంచుతాం. ఎలుకలు తినడానికే... ఒక ఎలుక ధాన్యం తినడమే కాక... పుస్తకాలు కొరుకుతుంది. బట్టలు కొరుకుతుంది. అటువంటి ఎలుకల చంపే పిల్లికి మనం అన్నం పెడితేనే కదా! అది ఉండేది.
పిల్లికి పెరుగన్నం అంటే... అంత ఇష్టమా తాతయ్య. అవును. మనం పెరుగన్నం పెట్టకపోతే.. అన్నం పెట్టే ఇంటికి వెళ్తుంది కదా. అవును తాతయ్య.
నేను ఇప్పటినుండి ప్రతిరోజూ పెరుగన్నం పెడతా గా.. శభాష్ అన్నాడు తాతయ్య.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి