అది అగ్రస్థానం అని అది గొప్పతనం అని
అందరికీ అందుబాటులో ఉంటే
అది నిమ్నస్థానమని నిరాధారణమని
ప్రపంచ ప్రచారంలో ఉంది.
గాలి అందరికీ అందుబాటులో ఉంటుంది
లేకుంటే ఏమవుతుంది.!?
నీరు అందరికీ అందుబాటులో ఉంటుంది
లేకుంటే ఏం జరుగుతుంది.!?
సూర్యుడు అందరికీ అందుబాటులో ఉంటాడు
లేకుంటే ఏం జరుగుతుంది.!?
గాలి నీరు సూర్యుని కన్నా గొప్ప వాళ్ళు ఎవరుంటారు!?
మనం వాళ్ళ కన్నా గొప్ప వాళ్ళమేం కాదు కదా..!?
నిజానికి అన్ని సమయాలలో అందరికీ అందుబాటులో
ఉండటమే అగ్రస్థానం అని నిరూపించింది ప్రకృతి....!!?
=========================================================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి