తాతయ్య కథలు-52..- ఎన్నవెళ్లి రాజమౌళి

 అరేయ్! పిట్ట కొంచెం కూత ఘనం రా నీది.
నేనేమీ కూత పెట్టాను తాతయ్య. అని మనవడు అనగానే-పకపకా నవ్విన తాతయ్య-పిట్ట కొంచెం కూత ఘనం అంటే... చిన్న గున్నా.. పెద్ద పెద్ద పనులు చేస్తారన్నమాట.
ఇదే కాక, ఎవరైనా వారి వయస్సు స్థాయికి మించిన పనులు చేస్తే వాళ్లకు కూడా అప్పుడు ఈ సామెత వాడతారు.
మన తెలుగు భాషలో సామెతలు బాగానే ఉన్నాయి తాతయ్య.
అవును మన సామెతలు, జాతీయాలు, నానుడిలు తెలుసుకోవాలి.
ఎందుకు తాతయ్య. ఇవి సందర్భోచితంగా వాడితే... అక్కడ మనం గొప్పగా  భావించ బడతాం.
ఇంకా పద్యాలు కూడా రావాల్నా తాతయ్య. బాగా అడిగావు. వేమన, బద్దెన, జంధ్యాల పాపయ్య శాస్త్రి లాంటివాళ్ళు ఎందరో గొప్ప గొప్ప పద్యాలు రాశారు. ఇవి కూడా నేర్చుకోవాలి అన్నాడు తాతయ్య.
కామెంట్‌లు