తాతయ్య కథలు-55.. _ ఎన్నవెళ్లి రాజమౌళి

 అడుగనేరని బాకీ తేరనేరదిరా... బదలు ఇస్తే ఇస్తానన్నా తేదీన ఇవ్వకపోతే అడుగుతూనే ఉండాలి. అని నాన్న అనగానే-
మల్లయ్యను అడుగుతూనే ఉన్నా నాన్న. అయినా ఇవ్వడం లేదు. నేను ఇచ్చి ఆరు నెలలు అవుతుంది.
ఈ మాటలు విన్న మనవడు-ఏమిటి తాతయ్య. ఇప్పుడేదో నాన్నతో అన్నావు అనగానే -
అదా! అది ఒక సామెత. డబ్బు విషయములో లో జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు వాళ్ల గురించి తెలుసుకోవాలి.
ఇచ్చిన ఇస్తానన్నా తేదీన ఇవ్వకపోతే... మళ్లీ అడగాలి. అలా అలా అడుగుతునే ఉండాలి. అడగకపోతే... నాకు జ్ఞాపకమే లేదని తప్పించుకుంటారు.
నాన్న అబద్ధం చెబుతున్నాడు. డబ్బులిస్తే... అడగనే అడుగడు తాతయ్య. అందుకే కదా! నేను ఆ సామెత నాన్నతో అన్నాను.
బాగా అన్నావు తాతయ్య. నువ్వు చెబితేనే అడుగుతాడు. లేకపోతే లేదు. అవున్రా మనవడా. నీదంతా నా పుట్టు వడే. అని తాతయ్య అనగానే మనవడు నవ్వుతూ  బయటకు వెళ్లాడు.
కామెంట్‌లు