అమ్మపాడినట్టి అందమైన భాష
ఆత్మీయతలు పొంగిపొర్లెడి అజంతభాష
ఆదికవులనోట నాట్యమాడిన భాష
మృధు మధురగానమై సుమధుర నాదమై
యతి ప్రాసలతో శృతిచేయు భాష
తేనెలూరు భాష నా తెలుగు భాష
అలంకార ప్రభలతో అలరారు నా తెలుగు
మమకారము కలిగించే తొలిపలుకు తెలుగు
ఒంపుసొంపులన్ని చేరి వయ్యారమైనట్టు
ఒత్తులన్ని గూడి హత్తుకుని తిరుగాడు
తెలుగు మాట్లాడిచూడు ఒకసారి
దేహమందు చైతన్యమగు డెబ్బైరెండు నాడులోమారు
వెండి వెన్నెల వెలుగులో పిండారబోసినట్లు
గుండెనిండిన ప్రేమను చెప్పకనే తెలుపు
యాస ఏదైన తెలుగు శ్వాస ఒకటే
ఏ భాష మెఱుపైనా ఏ ధ్యాస మరుపైనా
ఏ తీరుగైన కలుపుకొనిపోవు నా తెలుగువెలుగు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి