ఆ.వె
చీరకట్టులోన సింగారమలరి నీ
నందమైనశిల్పమతివచూడ
నాటికాలమందు నారీశిరోమణుల్
మేడిపండుతీరు మెరియుచుండు
తే.గీ
చూడ చక్కని శిల్పమై సొంపులమరి
నెదిరి చూసేడి విధములో నిశ్చలతను
పోలి యున్నట్టి పడతికీ నూలుచీర
నందమొనరించె వర్ణించ నలవిగాదు
కం
బంగారానికి వన్నెగ
సింగారపు చీరకట్టు సిరులొలికించెన్
శృంగారపు భంగిమలో
సింగిడివలె నిలచె నీమె చెట్లనడిమినన్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి