యోగ :=చంద్రకళ. దీకొండ,మల్కాజిగిరి,మేడ్చల్ జిల్లా.చరవాణి:9381361384

పల్లవి:-
🌷🌷
యోగా చేయరా...
రోజూ యోగా చేయరా...
ఆ యోగా నీవు చేస్తే...
రాజయోగం నీదగులేరా...(2)
చరణం:-
🌷🌷
అనారోగ్యం రాకూడదంటే 
ఆసనాలు వేయాలి...
ఆరోగ్యంగా ఉండాలంటే... 
యోగా నువ్వు చేయాలి...!
బద్ధకించినావంటే బి. పి. యే పెరిగేను...
అలవాటే చేసుకుంటే ఆనందం కలిగేను...
రోజూ నువ్ చేసావంటే...
రోగాలే దూరమౌను...!
యోగా చేయరా...
రోజూ యోగా చేయరా...
చరణం:-
🌷🌷
వయసున్నంతకాలం దేహం 
నీ మాటే వినును...
వయసుడిగిన వేళ... 
ఎముకలు బలహీనపడును...!

చుట్టుముట్టు కాలుష్యాన్ని మట్టుపెట్టబూనుమురా...
నరాల శుద్ధి కోసం 
యోగానే చేయుమురా...!

మెదడేమో పదునెక్కు...
చదువు బాగ తలకెక్కు...
మందులతో పనిలేకుండా...
ఆరోగ్యం కలిగేను...!

యోగా చేయరా...
రోజూ యోగా చేయరా...
ఆ యోగా నీవు చేస్తే... 
రాజయోగం నీదగులేరా...!!!
*************************************
((మత్తు వదలరా...నిద్దుర మత్తు వదలరా...ట్యూన్ లో ))

కామెంట్‌లు