*సీసం*
ఆవుపూజనుజేయ యవనిలో నిరతము
మంచిజరుగుచుండు మనకు నెపుడు
పాలనెన్నోయిచ్చి బలమునే పెంచియు
శక్తినొసంగును యుక్తికొరకు
పేడతోనందరు పిడకలుజేయగ
రోగములెతొలగు లోకమందు
ఇంటిలోగోమూత్ర మెల్లప్పు డును జిల్క
క్రిములనుతొలగించి క్షేమ మొసగు
*తేటగీతి*
గోవుపూజనుజేయగకోర్కెతోడ
పుణ్యఫలములుగొప్పగపొందగలరు
తల్లివోలెనుసేవించధరణియందు
దైవమూర్తులుదిగివచ్చి దీవెనిడరె
గోమాత విశిష్టత:-బెజుగాం శ్రీజ -త్రిపుల్ ఐటీ బాసర గుర్రాలగొంది జిల్లా సిద్దిపేట.చరవాణి9391097371
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి